
కేరళను నిఫా వైరస్ మళ్లీ వణికిస్తోంది. కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయపడుతున్నారు. పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి జులై 12న మృతి చెందాడు. బాధితునికి నిఫా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు అంతకు ముందే మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిఫా ఇన్ఫెక్షన్తో మరణించాడు. దీంతో వందలాది మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌పై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖకు పెద్ద సవాల్‌గా మారింది.