ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు, దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు. అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు

