
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ ప్రభుత్వం క్లియర్ చేసింది. 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయ్యింది.
ఈనెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల సంక్షేమ మంత్రుల సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించడం విశేషం.