
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఉన్న ‘ఇన్వర్షన్’ సంస్థ అంతరిక్ష రంగంలో కొత్త అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ ‘ఆర్క్’ ను ఆవిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వాహనం ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఏ ప్రాంతానికైనా ఒక గంటలోపు వస్తువులను డెలివరీ చేయగల సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘ఆర్క్’ (RK) వాహనం పొడవు 8 అడుగులు, వెడల్పు 4 అడుగులు ఉండి పెద్ద టేబుల్‌టాప్ పరిమాణంలో ఉంటుంది.