ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రపంచ కాపీ హక్కుల దినోత్సవం) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1995 నుండి నిర్వహించబడుతున్న విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా వంటి రచయితలు మరణించిన తేది, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేది ఏప్రిల్ 23వ తేది అవడంవల్ల 1995, ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది.

