భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం (జూన్ 16)న సైప్రస్‌లో అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIతో ప్రధాని మోడీని సత్కరించారు.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ నుండి మోడీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ గౌరవాన్ని పురస్కారాన్ని స్వీకరిస్తూ.. అవార్డును ఇరు దేశాల మధ్య స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రదాని మోడీ ప్రకటించారు.

