
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. ఆర్చరీ లీగ్ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు.