
పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీలు ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. అధ్యక్షునితో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్య నిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.