
ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం కావాలని, కూటమి సర్కారు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏమైనా తప్పులు చేస్తే ప్రజలు, రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు.