
అమరావతి రీలాంచ్ సభ సక్సెస్ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తాజాగా ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అమరావతి రీలాంచ్ కు విజయానికి ప్రధాన కారణం ప్రజల భాగస్వామ్యమని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే వేదికపై ఉత్సాహంగా పాల్గొనడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కృషిని కొనియాడారు. బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశారన్నారు.