గోదావరిఖని పట్టణంలో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తునారు? ఎక్కడ వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని వాట్సాప్ గ్రూప్ సభ్యులు అందులో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఎస్సై ఆ గ్రూపులో ఎస్సై జాయిన్ అయ్యాడనే విషయం తెలియగానే.. ఆ గ్రూప్‌లోని సభ్యులు ఒక్కొక్కరుగా గ్రూప్‌ను వీడటం మొదలుపెట్టారు. ‘మీ ఫోన్ నంబర్లు అన్నీ సేవ్ చేసుకున్నా. త్వరలోనే మీ అందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తా’ అంటూ ఒక వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు.

