తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు.

