పోలవరం జిల్లా మన్యంలోని అడ్డతీగల అటవీ ప్రాంతంలో పెద్దపులి పంట పొలాల్లో ఆవు దూడని దాడి చేసి మరీ చంపేసింది. ఏలేరు జలాశయం వెనక జలాల వైపు సంచరిస్తున్న పెద్దపులి శుక్రవారం గంగవరం మండలం ట్యాంకుబీడు నుంచి పయనించి అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని డి. కృష్ణవరం పొలాల్లో దాడి చేసి పులి ఆవూదూడను చంపేసింది. పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా కంబాలపాలెం, మర్రివీడ ప్రాంతంలో ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు.

