పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని తడికోట గ్రామంలో చోళ్ల చిన్న రెడ్డి (20) అనే గిరిజనుడు చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని తీసుకెళ్లడానికి ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కదలలేని స్థితిలో ఉన్న చిన్న రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టి ఐదు కిలోమీటర్లు గిరిజనులు మోసుకెళ్లారు. మధ్యలో ఏడు చోట్ల వాగులను అతి కష్టం మీద దాటాల్సి వచ్చింది., 108 సిబ్బంది సహాయంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

