వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నానిని ఒక బఫూన్‌గా అభివర్ణించారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బందరులో ఒక బఫూన్ ఉన్నాడని, షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడని, మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చాడని పేర్ని నానిని ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి భూములు దోచుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

