
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ‘‘ప్రస్తుతం 40 లక్షల ఇళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 కోట్ల మందికి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలకు రూ.21 వేల కోట్ల రుణాలు ఇచ్చాం.ేశంలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణను టాప్‌లో నిలిపాం,” అని సీఎం తెలిపారు.