దేశీ ప్రభుత్వం రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. హై-ఎండ్ లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌లలో ఉపయోగించే ఎక్స్పీ100 పెట్రోల్ ధరను లీటరుకు రూ.11 పెంచింది. దీంతో ఎక్స్పీ100 లీటర్ పెట్రోల్ ధర రూ.160కి చేర్చారు. ప్రీమియం డీజిల్ వేరియంట్ ‘ఎక్స్ట్రా గ్రీన్’ ధరను లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి.

