టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి అని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అండదండల వల్లే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి అసాంఘిక శక్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ నిలదీశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని జగన్ దుయ్యబట్టారు. బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, పాలకుల మైండ్సెట్ వల్లే నేరాలు పెరుగుతున్నాయని విమర్శించారు.

