పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించిన సీఎం పీపీపీ విధానంపై ముందుకేనని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు విజీఎఫ్కు నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని వివరించారు.

