పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగితే ప్రజలు క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ అధికారులు అందించిన వివరాలను సీఎం పరిశీలించారు. ఆపై తిరుపతికి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవాలయం పరిసరాల్లో పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, చెత్త తొలగించారు. .

