
డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్క్రీమ్లు కొనివ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు. ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, సిటీ గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తుందని.. రేపు మా పిల్లలను బయటకు పంపించాలంటే ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటదని చెప్పారు. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రామ్ చరణ్ అన్నారు.