రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో 2026-27 సంవత్సరానికి గానూ ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది

