గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంటు తీసుకెళ్లడానికి కేసీఆర్ గతంలో ఓకే చెప్పారని ఏపీ మంత్రులు చెబుతున్న దాంట్లో పూర్తి వాస్తవం లేదు. రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

