
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేకంగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయానికి గడువు నిర్ణయించడంతో, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం కానున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.