ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ధరలు ఫ్రాన్స్ రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. దీనికి నిరసనగా సోమవారం (మార్చి 30, 2026) పారిస్ రింగ్ రోడ్డుపై వందలాది ట్రక్కులు, బస్సులతో డ్రైవర్లు ‘స్లో-మూవింగ్’ (నత్తనడక) నిరసన చేపట్టారు. దీనివల్ల పారిస్ నగరం చుట్టూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన 50 మిలియన్ యూరోల అత్యవసర సాయం ఏమాత్రం సరిపోదని, లీటరుపై కనీసం 50 సెంట్లకు పైగా రాయితీ ఇవ్వాలని రవాణా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

