
ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతిపై బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరా తీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పేర్కొన్నారు. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి వెంటనే 50 లక్షల రుపాయల ఎక్స్ గ్రేషియాతోపాటు.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.