పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్‌పాత్‌లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న పానీపూరీ విక్రేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ములుండ్ నేత అవినాష్ బాగుల్ తన స్థలమని చెప్పి మోసగించాడని ఆరోపించాడు. తన తల్లి బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.3 లక్షలు శివసేన నేతకు ఇచ్చినట్లు వాపోయాడు.

