
ఆస్ట్రియాలోని అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రాజ్ నగరంలోని ఒక పాఠశాలలో జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది విద్యార్థులు మరణించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడు పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు ముగియగానే, చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకున్నాడు. దాడి చేసిన విద్యార్థి కూడా అక్కడికక్కడే మరణించాడు.