
ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం ఉడిపి జిల్లాలోని కన్యాణ గ్రామం కుద్లు తండాకు వచ్చింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పడం, సృజన్మాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఊరికి కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోకూడదని ఆ బృందం భావించింది. ఈ క్రమంలోనే పాఠశాలకు అత్యవసరమైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించుకుంది. విద్యార్థుల కోసం పూర్తిస్థాయి మరుగుదొడ్ల సౌకర్యాన్ని సొంతంగా నిర్మించి పాఠశాలకు అందజేశారు.