పాకిస్థాన్ విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్ పాకిస్థాన్‌తో జట్టుకట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో స్వల్పకాలిక మిషన్లలో భాగంగా పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ వద్దకు త్వరలో తీసుకెళ్లనుంది. అందుకోసం చైనా వ్యోమగాములతో కలిసి పాకిస్థాన్ వ్యోమగామికి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాగన్ ప్రకటన విడుదల చేసింది.

