ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు 47 మందికి యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఒక్కొక్కరూ 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, తగలబెట్టడం, పోలీసులు, భద్రతా బలగాలపైకి దాడికి పాల్పడటం వంటివి చేశారని ప్రభుత్వం ఆరోపించింది.

