ఒవైసీ తన వీడియో సందేశంలో, పహల్గామ్లో జరిగిన ఈ దాడి మానవత్వానికి వ్యతిరేకమైన చర్య. ఈ దాడి వల్ల మన కాశ్మీరీ సోదరులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉగ్రవాదులకు లభించింది. అందుకే, ఈ దాడిని ఖండిస్తూ, శాంతియుతంగా నిరసన తెలపడానికి నల్ల బ్యాడ్జీలు ధరించాలి, అని అన్నారు. ఈ దాడిని ఒవైసీ గతంలో జరిగిన యూరి, పుల్వామా దాడుల కంటే ఎక్కువ హీనమైనదిగా అభివర్ణించారు. ఈ ఘటన భారత ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని కూడా తెలియజేస్తుందని ఆయన విమర్శించారు.

