
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా విశాఖలో దాదాపు 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో అదే మార్గంలో వెళ్లాల్సిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మార్నింగ్ షిఫ్ట్ కి సకాలంలో వెళ్లలేక పరీక్షకు దూరం అయ్యారు. దీంతో ఇన్నేళ్ల తమ కష్టానికి ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇప్పుడా విద్యార్థుల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చొరవ చూపి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారా?