ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు భాగస్వామ్యం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ సహా వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

