తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పదవీ గండం నుంచి అజారుద్దీన గట్టెక్కారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవుల నియామక ఫైల్‌పై గవర్నర్ శివ్‌ప్రతాప్ సంతకం చేశారు. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంను నియమిస్తూ గత ఆగస్టు 30న గవర్నర్ వద్దు తెలంగాణ ప్రభుత్వం పంపింది. అజారుద్దీన్‌ను మంత్రిగా ఆరు నెలల గడువు పూర్తి అవుతున్న టైంలో గవర్నర్ ఆ ఫైల్‌ను క్లియర్ చేశారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు అజారుద్దీన్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.

