మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్సీపీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆమెను తమ నేతగా ఎన్నుకోనున్నట్లు మంత్రి ఛగన్ భుజ్బల్ తెలిపారు. శనివారమే ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా తమకు అభ్యంతరం లేదని సీఎం దేవేంద్ర ఫడణవీస్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

