గూగుల్ ఆఫీస్ మన్‌హాటన్‌లో తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచన న్యూయార్క్‌లోని మన్‌హాటన చెల్సియా క్యాంపస్‌లో గూగుల్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడింది. ఆఫీసులో ఏర్పడిన నల్లుల సమస్యను ఎదుర్కోవడానికి కంపెనీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. ఈ నెల 19న ఆఫీసు మూతపడినప్పటి నుంచి, నల్లుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగులు కార్యాలయానికి రాకూడదని గూగుల్ పేర్కొంది. మన్‌హాటన్ గూగుల్ ఆఫీస్‌లో ప్రస్తుతం నల్లుల నివారణ చర్యలు చేపట్టబడుతున్నాయి.

