డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం, అందులో సిఎం బావమరిది రింగ్మెన్ పాత్ర పోషించడం నిజం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఆరోపించారు. నైనీ టెండర్
రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా..? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్మీట్పై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

