నేపాల్‌లో మరోసారి నిరసనలు చెలరేగాయి. దేశంలో జెన్ జీ యువత మరోసారి ఆందోళనకు దిగడంతో అనేక ప్రాంతాల్లో కర్ఫూ విధించారు. వివరాలు… నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం ఉద్రిక్తతలు పెరిగాయి. జెన్ జీ నిరసనకారులు, మాజీ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) మద్దతుదారుల మధ్య తిరిగి ఘర్షణలు చెలరేగాయి. దీంతో అధికారులు తిరిగి పగటిపూట కర్ఫ్యూ విధించారు

