నారాయణపేట జిల్లా కోస్గిలో సిఎం పర్యటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి రేషన్ కార్డు రాని వారి పేర్లు రాసుకోవాలని సూచించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు తాను ఉన్నంతకాలం కెసిఆర్‌కు అధికారం దక్కనివ్వనని సిఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించామని. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా వాళ్లదే పై చేయి అంటారా? అని ప్రశ్నించారు

