
ఓజీ సినిమాలో పోషించిన ఓజాస్ గంభీర గెటప్ లో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు వచ్చారు. సినిమాలో ఉపయోగించిన పెద్ద కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చారు. ‘వాషి యో వాషి’ అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయానని, అందుకే ఇలా కత్తి పట్టుకొచ్చానని అన్నారు. సుజిత్ వల్ల ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సినిమా గెటప్ లో రావాల్సి వచ్చిందన్నారు.