
చిరంజీవి ప్రకటనలో ఈ విధంగా అన్నారు. “నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.” ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన సమస్య అని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరు అయినా ఈ విషయంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చిరంజీవి వివరించారు.