హెచ్ 1బీ, హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలన ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా పరిశీలించనుంది. కేవలం హెచ్1 బీ వీసా దరఖాస్తుదారుల ఖాతాలను మాత్రమే కాకుండా.. హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనుంది. వీసా దరఖాస్తుదారులు తమ ఖాతాను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని సూచించింది. ఇండియాకు చెందిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే ఇండియాలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నారు.

