
తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టిసి కార్మికులు సమ్మెకు సన్నద్దమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో మే 7వ తేదీ నుండి రాష్ట్రంలో బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే అశ్వథ్థామ రెడ్డి నేతృత్వంలోని ఆర్టిసి జెఎసి సమ్మెకు దూరంగా ఉంది. దీంతో ఆర్టిసి సంఘాలు రెండు జెఎసీలుగా చీలి పోయాయి. వెంకన్న నేతృత్వంలోని ఆర్టిసి జెఎసి సమ్మె నోటీసు ఇచ్చి 7 నుండి సమ్మెకు వెళుతుండగా అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని జెఎసి సమ్మెకు దూరంగా ఉంటూ విధులకు హాజరవుతోంది.