తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డిజిపి బి. శివధర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు

