అగ్నిమాపకశాఖ నూతన వాహనాలు, పరికరాలను అమరావతి పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.ఇందులో భాగంగా రూ. 33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసింది. రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లెటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

