సినిమాలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే టిక్కెటు రేట్లు తక్కువ ధరలుండాలని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని అన్నారు. భవిష్యత్లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని, నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈసారి పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

