తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ దగ్గర.. 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కవిత ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు.

