
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను వెంటాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు చేస్తోన్న అభిమానులు.. ఇప్పుడా యుద్ధాన్ని దాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. సారీ చెబుతావా.. లేక చిక్కుల్లో పడతావా.. అంటూ కొత్త డిమాండ్లను ముందుపెట్టారు. నాలుగు గోడల మధ్య కాదు.. అనంతపురం నడిబొడ్డున సారీ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ కన్వీనర్ నరేంద్రచౌదరి. క్షమాపణ చెప్పకపోతే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ఛలో అనంతపురానికి పిలుపునిస్తామని జూనియర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.