తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాటపై టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించడంతోపాటు.. వీడియో విడుదల చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. ఎంతో ప్రేమతో తన మీటింగ్‌కు ప్రజలు వచ్చారని.. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని విజయ్ పేర్కొన్నారు. తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని విజయ్ పేర్కొన్నారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు.. నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లకండి.. అంటూ విజయ్ కోరారు. సీఎం స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

